- Advertisement -
మంచిర్యాల: ఉరేసుకొని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హమాలివాడలో జంజిరాల స్నేహలత- మహేష్ అనే దంపతులు నివసిస్తున్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో ప్రైవేట్ పాఠశాలలో స్నేహలత ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తుంది. సోమవారం ఉదయం స్నేహలత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం భర్త మహేష్ వేధింపులు భరించలేక స్నేహలత ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -