Wednesday, April 16, 2025

విధుల నుంచి తొలగించడంతో స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

విధులు నుంచి తొలగించడంతో ఓ ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఎపిలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ శ్రీనివాసపురం కాలనీకి చెందిన శ్రీవాణి(45) అనే మహిళ ఓ ప్రైవేటు స్కూల్ లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. అయితే, కొంతకాలంగా ఆమె భర్త సురేంద్రనాథ్‌.. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

ఈ క్రమంలో శ్రీవాణి తన భర్తను చూసుకునేందుకు సెలవు కోరగా.. పరీక్షల సమయమని సెలవు ఇవ్వడం కుదరని పాఠశాల యాజమాన్యం తేల్చి చెప్పింది. అయితే శ్రీవాణి మాత్రం భర్త కోసం సెలవు పెట్టింది. దీంతో ఆగ్రహించిన యాజమాన్యం.. ఆమెను విధులు నుంచి తొలగించింది. ఈ క్రమంలో భర్త అనారోగ్యంతో ఉండటం.. తనను విధులు నుంచి తొలగించడంతో ఆందోళనకు గురైన శ్రీవాణి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News