Friday, November 22, 2024

తెరుచుకొని ప్రైవేటు పాఠశాలలు

- Advertisement -
- Advertisement -

వైరస్ భయంతో ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి బడులకు తాళం
మరోపక్క ఫీజుల వేధింపులతో విముఖత చూపుతున్న చిన్నారులు
గణేష్ ఉత్సవాలు ముగిసిన బడిలో గంట కొడుతామంటున్న యాజమాన్యాలు
ఈనెలారులో తెరవక పోతే గుర్తింపు రద్దు చేస్తామంటున్న విద్యాశాఖ


మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యాసంస్దలో ప్రత్యక్ష పాఠాలు ప్రారంభమై వారం రోజులు గడిచిన ఇంకా మరో కొన్ని చోట్ల ప్రైవేటు పాఠశాలు తెరుచుకోలేదు. ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి వరకు నిర్వహించే పాఠశాలకు తాళం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కరోనా భయంతో పాటు, ఫీజుల వేధింపులతో విద్యార్దులు బడుల వైపు రావడం లేదు. కొవిడ్ నిబంధనలు పాటించకుంటే థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరించడంతో నెల రోజుల తరువాత బడిబాట పడుతామంటున్నారు.గణేష్ ఉత్సవాలు ముగిస్తే వైరస్ ప్రభావ ఎంతో తేలిపోతుందని, అప్పటివరకు చిన్నారులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని పాఠశాల నిర్వహకులను కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్నతపాఠశాల విద్యార్దులు మాత్రమే ప్రత్యక్ష పాఠాలకు హాజరైతున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 690 ఉండగా అన్నింటిలో విద్యార్దులు 50శాతానికి పైగా హాజరైతుండగా, ప్రైవేటు యాజమాన్యాలు పూర్తి స్దాయిలో విద్యార్దులు స్కూళ్ల రాకపోవడంతో తల్లిదండ్రులకు పోన్‌ల్లో సిబ్బందితో మాట్లాడిస్తూ తరగతులకు హాజరుకాకుండా పైతరగతులకు పంపమని, విద్యాబోధనలో వెనకబడుతారని పేర్కొంటూ వీలైనంత త్వరగా పంపించాలని కోరుతున్నారు.

సగమంది విద్యార్దులు వచ్చిన, పూర్తి స్దాయిలో చిన్నారులు హాజరైన బోధన సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బందికి పూర్తి స్దాయిలో వేతనాలు చెల్లించాల్సి వస్తుంది. దీంతో విద్యార్దులు స్కూళుకు వస్తే ఫీజులు వసూలు చేసి బడులు కొనసాగించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లుతున్నారు. కానీ విద్యార్దుల తల్లిదండ్రులు ముందుగా ఫీజులు తీసుకుని వైరస్ పేరుతో మళ్లీ మూతవేస్తారని అనుమానం వ్యక్తం చేస్తూ దసరా తరువాత వైరస్ రాకుంటే ఫీజులు చెల్లిస్తామని కొందరు చెబుతున్నట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఇప్పట్లో ఫీజులు వసూలు చేయకుంటే ఆర్దిక పరమైన సమస్యలు వస్తాయని భావిస్తూ కొన్ని పాఠశాల నిర్వహకులు ప్రాథమిక స్దాయి విద్యార్దులకు డిజిటల్ పాఠాలు వినాలని సూచిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్దలు 1845 ఉండగా, వాటిలో ఇప్పటివరకు 410 స్కూళ్లు గేట్లు తెరవలేదని, వీటిలో ఎక్కువశాతం ప్రైమరీ స్కూళ్లు ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంటుంది. ఈపాఠశాలలు ఈనెలాఖరులోగా తెరవకపోతే గుర్తింపు రద్దు పిల్లలను సమీపంలో ఉన్న ప్రభుత్వం పాఠశాల్లో చేర్చుతామని వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News