ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు టీచర్
భార్య కూడా అదే బాట
మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సి పాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో నాల్గవ వార్డు ప్రైవేట్ టీచర్ వెన్నం రవికుమార్, మొన్న మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. నేడు రవి భార్య అక్కమ్మ సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహ త్య చేసుకుంది. కరోనా కారణంగా ఏడాది పాటు ఉపాధి లేకపోవటంతో సమస్యలు తలెత్తాయని దంపతుల మధ్య ఆర్థిక పరమైన గొడవలు, మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి ఆత్మహత్యతో పిల్లలు బి.సందేశ్ (5), సాకి(3) సంవత్సరాలు అనాథ లుగా మారారు. పదకొండేళ్లుగా అన్యోన్య దాంపత్యజీవితం ఇద్దరు సం తోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తలకిందులయ్యింది. తండ్రి, తల్లి ఆత్మహత్యలతో ఆ పిల్లలిద్దరూ అనాథలైయ్యారు.
అనాథ పిల్లలకు అండగా కుందూరు కుటుంబం
ఇబ్బందులతో ఆత్మహత్య పాల్పడిన ప్రైవేట్ టీచర్ రవికుమార్ దంపతులు అనాథలైన ఇద్దరు చిన్నారులు వెన్నం సందేష్, వెన్నెం సాక్షి ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంటానన్న జా నారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి, చిన్నారులను చదువు, వసతి సౌకర్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ తానే చూసుకుం టానని తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్స్ ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు.
Private Teacher’s Wife Suicide in Nagarjuna Sagar