Saturday, December 28, 2024

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా : 10 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కూసుమంచి : కూసుమంచి మండలం పాలేరు -నాయకన్ గూడెం జాతీయ రహదారి 365 బిబిపై కెవీఆర్ ట్రావెల్స్ బస్సు తెల్లవారు జామున అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు, హైవే పెట్రో సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 33 మందికి గాయాలు కాగా వారిలో ఇద్దరు మరింత తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

క్షతగాత్రులను 108, హైవే అంబులెన్సు 1033 సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 33మంది ప్రయాణికులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News