Sunday, December 22, 2024

నల్లగొండలో ట్రావెల్స్ బస్సు దగ్ధం…. ఒకరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి బస్సు దిగలేక సజీవదహనమయ్యాడు. బస్సు హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపుగా 39 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రయాణికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News