- Advertisement -
హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ఆటోనగర్ వద్ద అద్దంకి-నార్కట్ పట్టి రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బోల్తా పడిన బస్సు శ్రీ కృష్ణ ట్రావెల్స్ కు చెందినది. అతి వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -