Monday, December 23, 2024

ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 9 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. వారిలో ఆరుగురు మరింత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News