- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని నకరికల్లు మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. మండలంలోని శాంతినగర్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -