Friday, November 15, 2024

తిరుపతి సహా 13 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

- Advertisement -
- Advertisement -

Privatization of 13 airports including Tirupati

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆస్తుల విక్రయ ప్రక్రియలో భాగంగా దేశం లోని 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తుది అనుమతి ఇచ్చింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఎయిర్‌పోర్టుల్లో రూ.3660 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను లక్షంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 13 ఎయిర్ పోర్టుల్లో 6 మేజర్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. భువనేశ్వర్, వారణాసి, అమృతసర్, తిరుచ్చి, ఇండోర్, రాయపూర్‌లతోపాటు తిరుపతి, జార్సుగుడా, గయ, ఖుషీనగర్, కాంగ్రా, జబల్‌పూర్, జాల్గావ్ లాంటి ఏడు చిన్న ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఒక బిడ్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేయడానికి ఇప్పుడు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఓ కన్సల్టెంట్‌ను నియమించనున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో బిడ్స్‌ను ఆహ్వానించనున్నది. ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణలో తొలిసారి మేజర్ ఎయిర్ పోర్టులతోపాటు చిన్న ఎయిర్ పోర్టులను కలుపుతున్నారు. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి, ఎయిర్ పోర్టుతో కలపనుండగా, జార్సుగుడా ను భువనేశ్వర్‌తో,ఖుషీనగర్, గయ ఎయిర్‌పోర్టులను వారణాసితో, కాంగ్రాను రాయ్‌పూర్‌తో, అమృత్‌సర్‌ను జబల్‌పూర్‌తో క్లబ్ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News