Wednesday, January 22, 2025

పీయూష్ గోయల్‌పై రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజ్యసభా పక్షనేత పీయూష్ గోయల్ ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాల కూటమి “ఇండియా” ఫ్లోర్ లీడర్లు ప్రివిలేజ్ మోషన్‌ను రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. గోయల్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. “ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇండియా కూటమి ఫ్లోర్‌లీడర్లు సభాపక్ష నేతపై ప్రివిలేజ్ మోషన్‌ను రాజ్యసభలో సమర్పించారు. విపక్షాలను ఆయన “ద్రోహులు” గా సంబోధించారు. దానికి ఆయన సభలో క్షమాపణ చెప్పాలిఅని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

ఇండియా కూటమి ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారని జైరాం రమేశ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు . మణిపూర్ అంశంపై చర్చించడానికి నరేంద్రమోడీ ప్రభుత్వం అంగీకరించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అందులోపేర్కొన్నారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి సభా నాయకుడు పీయూష్ గోయల్ తిరస్కరించడం మరో కారణంగా వెల్లడించారు. తాను ఏదైనా అన్‌పార్లమెంటరీగా మాట్లాడితే దాన్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను కోరారు. ఈ వ్యాఖ్యలను పరిశీలించిన తరువాత రికార్డుల నుంచి తొలగిస్తానని జగదీష్ ధన్‌ఖడ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News