- Advertisement -
డార్లింగ్’ సినిమా విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా మారింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శుక్రవారం మేకర్స్ థర్డ్ సింగిల్ సున్ చలియాను రిలీజ్ చేశారు. మొదటి రెండు పాటలు ప్రియదర్శి, నభా నటేష్‌ల సోలో నంబర్‌లు కాగా, మూడవ పాట ఇద్దరూ కలసి అలరించిన డ్యూయెట్. వివేక్ సాగర్ ఈ పాటని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా చాలా బ్యూటీఫుల్‌గా కంపోజ్ చేశారు. ఈ పాట లీడ్ పెయిర్ ప్రియదర్శి, నభా నటేష్‌ల లవ్లీ జర్నీని అద్భుతంగా చూపిస్తోంది. ’డార్లింగ్’ మూవీ ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
- Advertisement -