Sunday, January 19, 2025

జ్యోతిక అవకాశాలను కొట్టేస్తున్న ప్రియమణి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్లు జ్యోతిక, ప్రియమణి మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు భామలు సినిమాలో నటిస్తూ ముందుకు వెళ్తున్నారు. జ్యోతికకు వచ్చిన అవకాశాలను ప్రియమణి లాగేసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. విరాటపర్వం, జవాన్ లాంటి మూవీలో నటిస్తూ మంచి కంటెంట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. జ్యోతిక రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో ఆమె బదులుగా నిర్మాత దర్శకులు ప్రియమణికి అవకాశాలు ఇస్తున్నారు. జ్యోతిక హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్యతో కలిసి ఆమె సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News