Sunday, January 19, 2025

కనీసం 200 సీట్లు కూడా బిజెపి గెలవలేదు: ప్రియాంక్ ఖర్గే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలు, ఎన్‌డీఎకు మొత్తం 400 స్థానాలు సాధించాలన్న లక్షంతో బీజేపీ ఉన్నప్పటికీ, కనీసం 200 స్థానాల్లోనైనా గెలవలేదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే శనివారం వ్యాఖ్యానించారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది సీట్లయినా తెచ్చుకోలేదని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే బీజేపీ 200 సీట్లైనా తెచ్చుకోలేదని చెబుతోందని, కర్నాటక రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్ల వరకు అంతర్గత కుమ్ములాటల్లో బీజేపీ ఉంటోందని, అలాంటప్పుడు ఎలా గెలుచుకోగలుగుతారని వ్యాఖ్యానించారు.

విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని సీనియర్ బీజేపీ నేతలు అనేక మంది చెబుతున్నారన్నారు. ఒక కుటుంబం వల్ల బీజేపీ కలుషితమైందని ఆరోపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బసనగౌడ యత్నాల్, సిటి రవి, అనంత్‌కుమార్ హెగ్డే, ఈశ్వరప్ప వంటి బీజేపీ లోని హిందుత్వనేతలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నట్టు ఖర్గే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News