Monday, December 23, 2024

ఇండియా సినిమాల్లో అవి మాత్రమే చూపిస్తారు: ప్రియాంక చోప్రా

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: భారతీయ సినిమాలను కించపరుస్తూ అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యల పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్‌లో నటిగా జీవితాన్ని ప్రారంభించి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా తనకు నటిగా జన్మనిచ్చిన భారతీయ సినిమాలపై చేసిన విమర్శలను నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెపై ట్రోల్స్‌తో మండిపడుతున్నారు.

Also Read: ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు

2016లో ఎమ్మీస్ అవార్డ్ ఫంక్షన్‌లో హాలీవుడ్ స్టార్ టామ్ హిడిల్‌స్టన్‌తో కలసి అవార్డు అందుకున్న ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ మీద నడుస్తూ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారతీయ సినిమాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు పట్ల నెటిజన్లు ఆగ్రహోదగ్రులవుతున్నారు. భారతీయ సినిమాల్లో కేవలం నడుములు, వక్షోజాలే ఉంటాయంటూ ఆమె వ్యాఖ్యానించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. భారతీయ ‘’సినిమాను కించపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ వారు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News