Thursday, January 23, 2025

ప్రియాంక, నిక్ జంటకు సరోగసీ ద్వారా మగబిడ్డ

- Advertisement -
- Advertisement -

Priyanka Chopra Nick Jonas welcome their first child

సోషల్ మీడియా ద్వారా తెలిపిన జంట

ముంబయి: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులుఓ శుభవార్త తెలిపి సర్‌ప్రైజ్ చేశారు. సరోగసీ పద్ధతిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంకనిక్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.‘ సరోగసీ పద్ధతిలో మేం పండంటి బిడ్డకు జన్మనిచ్చాం.మాకెంతో సంతోషాన్ని ఇచ్చిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది.ఈ సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది.కాబట్టి దయచేసి మా వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నాం’ అంటూ ఈ జంట రాసుకొచ్చింది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లనుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.‘ కంగ్రాట్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక చోప్రా ‘ బేవాచ్’తో 2017లో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అదే సమయంలో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నాళ్ల డేటింగ్ అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. ఆ ఏడాది డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లో ఈ జంట ఒక్కటయింది. వివాహమైన తర్వాత ఆమె లాస్ ఏంజెల్స్‌లో సెటిలయింది. వరస హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘ జీ లే జరా’ అనే హిందీ చిత్రంలో ఆమె నటిస్తోంది. కత్రినా కైఫ్, అలియా భట్ కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News