Saturday, December 28, 2024

కర్నాటక ఎన్నికల ప్రచారానికి ప్రియాంక

- Advertisement -
- Advertisement -

Priyanka for the Karnataka election campaign

 

డికె శివకుమార్ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారని కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంఎల్‌సి ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానానికి అందచేయడంపై శివకుమార్‌కు, కర్నాటక శాసనసభా పక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శివకుమార్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ పని మీద తాను ఢిల్లీ వచ్చానని, ఎంఎల్‌సి అభర్థలు జాబితాను పార్టీ అధిష్టానం మరికొద్ది గంటల్లో ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. జూన్ 3న జరిగే ఏడు ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు మంగళవారం చివరి రోజు కాగా ఇప్పటివరకు కాంగ్రెస్, బిజెపి, జెడి(ఎస్) తమ అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News