Monday, January 20, 2025

రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ కుమార్తె

- Advertisement -
- Advertisement -

కోట: రాజస్థాన్‌లోని బుండిలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోమవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఆ యాత్ర ఉదయం 6 గంటలకు బుండి జిల్లాలోని బబాయ్‌లో ఉన్న తేజాజి మహారాజ్ మండీ నుంచి మొదలయింది. సోమవారం ‘నారి శక్తి పాదయాత్ర’ పేరిట సాగిన ఆ యాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు. కోట హైవేపై పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వారితో చేరారు. వారు స్వైమధోపుర్ జిల్లాలోని బబయ్ నుంచి పిపల్‌వాడాకు మార్చ్ చేశారు. సెప్టెంబర్ 7న పాదయాత్ర మొదలయినప్పటి నుంచి యాత్రలో పాల్గొంటున్న రాహుల్ రావు కూడా వారితో కలిసి నడిచాడు. రోడ్డుకు ఇరువైపుల పెద్ద సంఖ్యలో మహిళలు పాదయాత్రికులను స్వాగతిస్తూ వారితో కొంతసేపు నడిచారు.

రాహుల్ పాదయాత్ర రాజస్థాన్‌లో సోమవారం 7వ రోజుకు చేరింది. బుండి జిల్లాలో ఇదే చివరి రోజు. తేజాజీ మందిరం నుంచి మొదలయిన మార్చ్ ఉదయం 7.15 గంటలకు టోంక్ జిల్లాలో ప్రవేశించింది. దాదాపు 5000 మంది మహిళలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి నడిచారు. ఇందర్‌గఢ్(బుండి) బ్లాక్ ప్రెసిడెంట్ అజయ్ శర్మ కూడా నడకలో చేరారు. పాదయాత్రికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పాదయాత్ర 96వ రోజైన నేటి యాత్రను నారీ శక్తికి అంకితం చేశారని భారత్ జోడో యాత్ర కోఆర్డినేటర్ కపిల్ యాదవ్ తెలిపారు.

భారత్ జోడో యాత్ర డిసెంబర్ 21న హర్యానాలోకి ప్రవేశించనున్నది. ఈ యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్నాకుమారి నుంచి మొదలయింది. ఆ తర్వాత కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కూడా కొనసాగింది. చివరికి ఈ యాత్ర 2023 ఫిబ్రవరి మొదటి భాగంలో జమ్మూకశ్మీర్‌లో ముగుస్తుంది.

Rahul's BJY

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News