Monday, January 20, 2025

తండ్రి హత్య ఘటనపై తల్లడిల్లిన ప్రియాంక

- Advertisement -
- Advertisement -

 

చెన్నై : ప్రియాంక గాంధీ తనను వెల్లూరు జైలులో2008లో కలిసినప్పుడు రోదించారని నళిని శ్రీహరన్ తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయ్యి మూడు దశాబ్దాల జైలు తరువాత ఇటీవలే విడుదల అయిన నళిని అప్పట్లో తనను ప్రియాంక కలిసినప్పటి ఉదంతం గురించి గుర్తు చేసుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య గురించి ఆమె తనను ప్రశ్నించారని, ఎందుకు ఆయనను తుదముట్టించారని అడుగుతూ తండ్రిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని నళిని తెలిపింది. తండ్రిని పోగొట్టుకున్న బిడ్డ బాధ ఎంత కలిచివేసేదిలా ఉంటుందనేది తనకు ప్రియాంక కలిసినప్పుడు తెలిసిందని నళిని తెలిపారు.

రాజీవ్ హత్యకు సంబంధించి తనకు తెలిసింది ప్రియాంకకు చెప్పానని వివరించారు. అయితే ప్రియాంకతో భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన ఇతర వివరాలను తాను వెల్లడించలేనని, ఇవన్నీ ప్రియాంక వ్యక్తిగత అభిప్రాయాల పరిధిలోకి వస్తాయని , వీటిని వివరించడం సముచితం కాదని స్పష్టం చేశారు. రాజీవ్ హత్య కేసులో సుదీర్ఘ శిక్ష అనుభవించిన దోషులందరిని విడిచిపెట్టాని ఈ నెల 12వ తేదీనే సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది. ఈ మేరకు నళిని విడుదలయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News