Sunday, December 22, 2024

హథ్రాస్ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత:ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

హథ్రాస్‌లో తొక్కిసలాటపై బిజెపిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం తీవ్రంగా విమర్శించారు. అటువంటి సంఘటనలు సంభవిస్తూనే ఉంటాయని, కానీ జవాబుదారీని ప్రభుత్వం నిర్ధారించడం లేదని, ఆ పని చేయడానికి బదులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ప్రియాంక ఆరోపించారు. ‘మూడింతల మంది జనాన్ని అనుమతించారు, అధికార యంత్రాంగం అక్కడ లేదు, జనాన్ని అదుపు చేసేందుకు ఏర్పాట్లు లేవు, మండే ఎండ నుంచి తప్పించుకునే మార్గం లేదు, వైద్య బృందం లేదు, సంఘటన తరువాత అంబులెన్స్ లేదు, సాయపడేందుకు ఎవరూ లేరు, ఆసుపత్రిలో వైద్యులు లేరు, సౌకర్యాలు లేవు& ఇదినిర్లక్షానికి చాంతాడు జాబితా, కానీ ఎవరూ జవాబుదారీ కాదు’ అని ప్రియాంక ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో విమర్శించారు. చర్య తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది అని, అటువంటి సంఘటనల నివారణకు ఒక ప్లాన్ రూపొందించాలని ప్రియాంక కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News