Tuesday, December 24, 2024

నిరుద్యోగిత, ధరల పెరుగుదల పెద్ద సమస్యలు: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

దేశాన్ని వేధిస్తున్న సమస్యల్లో నిరుద్యోగిత, ధరల పెరుగుదల ‘అతిపెద్దవి’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందన్న దృఢవిశ్వాసాన్ని ప్రియాంక వ్యక్తం చేశారు. కూటమికి అనుకూల వాతావరణం కనిపిస్తోందని ఆమె చెప్పారు. శనివారం ఉదయం తన వోటు వేసిన అనంతరం ప్రియాంక గాంధీ ఈ డవ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందన్న దృఢనమ్మకాన్ని ప్రియాంక వ్యక్తం చేస్తూ, దేశంలో ప్రతి ఒక్కరికీ ‘అతిపెద్ద సమస్యలు’ నిరుద్యోగిత, అధిక ధరలు అని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఆప్ అభ్యర్థులకు వోటు వేస్తున్నారా అని, ఆప్ నేతలు కాంగ్రెస్‌కు వోటు వేస్తున్నారా అని అడిగినప్పుడు ‘మా విభేదాలను పక్కన పెట్టి మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం వోటు వేస్తున్నాం.

నేను అందుకు గర్విస్తున్నా’ అని ప్రియాంక సమాధానం ఇచ్చారు. అంతర్గతంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తమ ఆందోళనలను పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో ఉందని ఆ తరువాత ఆమె విలేకరులతో చెప్పారు. ‘బిజెపి నేతలు దాదాపు అన్ని రకాల విషయాలు మాట్లాడుతుంటారు. కాని ప్రధాన సమస్యలైన నిరుద్యోగిత, ధరల పెరుగుదల గురించి చర్చించరు. జనం ఇప్పుడు విసుగు చెందారు’ అని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏది పని చేస్తోందని ప్రశ్నించినప్పుడు ప్రియాంక సమాధానం ఇస్తూ, ‘మేము మొదటి నుంచి ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాం. దీనిపైనే మా ప్రచారం కూడా. మా మేనిఫెస్టో కూడా ఇదే ప్రస్తావించింది’ అని తెలిపారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరాయా వాద్రా, కుమారుడు రైహాన్ వాద్రా కూడా తమ వోట్లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News