Monday, December 23, 2024

తినేసి దోశెసిన ప్రియాంక… మైసూరు దోశ జిందాబాద్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు అన్నట్లు దోశలేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున ప్రియాంక ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మైసూరుకు వచ్చిన ప్రియాంక అక్కడ ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో దోశలు వేసేందుకు యత్నించారు. తినడానికి బ్రహ్మండంగా ఉండే దోశెలు రుచికరంగా వేయడానికి ఎంతో కష్టపడాల్సిందే, అంత ఈజీ కాదని స్పందించారు. ప్రియాంక వెంట పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్, ఇతర నేతలు రణదీప్ సూర్జేవాలా స్థానిక నేతలు ఇతరులు కొందరు ఉన్నారు.

Also read: కాంగ్రెస్ అధికారంలో రాగానే” బిసి బంధు” తీసుకొస్తాం: భట్టి

మైసూరులోని అత్యంత పురాతనమైన మైలరీ హోటల్‌కు వెళ్లి ముందుగా ఇడ్లీ, దోశె తినేసిన తరువాత ప్రియాంక తనకూ దోశ చేయాలని ఉందని చెప్పగానే సిబ్బంది ఆమెను లోపలికి తీసుకువెళ్లారు. తరువాత ఆమె కొద్ది సేపు దోశె కుస్తీ పట్టారు. ఈ ఫోటోలతో ట్విట్టర్‌లో వార్త వెలువరించారు. విశ్వసనీయత, సరైన ఆతిధ్యంతో వాసికెక్కిన ఈ హోటల్ స్వయంకృషితో ఏదైనా సాధించవచ్చుననే విషయాన్ని చాటిందని, ఇక్కడ కొద్ది సేపు తానూ దోశెలు వేసేందుకు యత్నించడం ఆనందంగా ఉందని తెలిపారు. దోశె తినిపించినందుకు పనిలో పనిగా దోశెలు వేసే ఛాన్సిచ్చినందుకు హోటల్ వారికి ధన్యవాదాలని తెలిపారు. ఇక్కడి దోశెలు మరీమరీ తినిపించేలా ఉన్నాయని, తాను తొందరలోనే ఇక్కడికి తన కూతురిని తీసుకువచ్చి దోశెల రుచిచూపిస్తానని కూడా తెలిపారు. మైసూరు దోశకు ప్రియాంక ఈ విధంగా ఓటేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News