Monday, December 23, 2024

దోస పోసిన ప్రియాంక.. హోటల్‌లో సందడి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా డోసమాస్టర్ అవతారమెత్తారు. బుధవారం ఉదయం మైసూరులోని సయ్యాజీ రావు రోడ్డులో ఉన్న మైలారీ అగ్రహార రెస్టారెంట్‌లో దోస పోసి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. గట్టి భద్రత నడుమ ప్రియాంక గాంధీ కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, కర్నాటక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ పుర్జీవాలాతో కలసి మైలారీ రెస్టారెంట్‌ను సందర్శించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు, చామరాజనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్న ప్రియాంక రాత్రి మైసూరులోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బసచేశారు.

Also Read: కన్నడిగులను బెదిరిస్తున్న అమిత్ షా: జైరాం రమేష్

priyanka gandhi cooking dosa video goes viral

అల్పాహారం నిమిత్తం మైలారీ రెస్టారెంట్‌ను సందర్శిచిన ఆమె ఇడ్లీ, దోస తిన్నారు. ఆ తర్వాత నేరుగా కిచెన్‌లోకి వెళ్లి పెనంపై దోస పిండి పోసి దోస తయారుచేశారు. కొద్దిసేపు పిల్లలతో ముచ్చటించిన ప్రియాంక వారితో కలసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ హోటల్‌లో దోస చాలా రుచిగా ఉందంటూ ఆమె కితాబునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News