Monday, January 20, 2025

‘సర్వజ్ఞుడై’న మోడీ కర్ణాటక బీజేపీ ప్రభుత్వ దోపిడీని ఎందుకు చూడలేక పోయారు

- Advertisement -
- Advertisement -

ఇండి ( కర్ణాటక): ‘ సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన’ ప్రధాని మోడీ కర్ణాటకలో బీజేపీకి చెందిన “40 శాతం కమిషన్ ప్రభుత్వం ” సాగిస్తున్న దోపిడీని ఎందుకు చూడలేకపోయారో ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మోడీపై తీవ్ర విమర్శల దాడి చేశారు. విజయపుర జిల్లాలో బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “వికాస్ పురుష్ ”(అభివృద్ధి నేత ) నరేంద్రమోడీ తాను కర్ణాటక అభివృద్ధి గురించి కలలు కంటున్నానని,‘ అభివృద్ది మోడల్’ గా కర్ణాటకను దేశానికి బహూకరిస్తానని ఎందుకు ఇంకా చెబుతున్నారో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆమె వ్యాఖ్యనించారు.

యావత్ ప్రపంచం ప్రధాని మోడీ ‘సర్వశక్తి వంతుడు’, ‘సుప్రీం’, ‘అందరికన్నా గొప్ప’, ‘వికాస్ పురుష్’ అని మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు.. మీ స్వంత ప్రభుత్వం 40 శాతం కమిషన్ ప్రభుత్వంగా కర్ణాటక ప్రజలను దోపిడీ చేస్తుంటే మీరేం చేస్తున్నారు ?అని ఆమె వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. “కర్ణాటక లోని దోపిడీని మోడీ చూడలేక కళ్లు మూసుకున్నారు. ఎందుకంటే కలలు కనడంలో మోడీ బిజీగా ఉన్నారు” అని ప్రియాంక మాటలతో దాడి చేశారు. “ మీరు కలలు పెద్దగా కంటూ బిజీగా ఉన్నందునే దోపిడీ, దొంగతనాలు జరుగుతున్నాయి . ఎవర్నీ మీరు ఆపలేక పోయారు. ఇదెలా జరుగుతుంది ?మీ ప్రభుత్వం 40 శాతం కమిషన్ సర్కార్‌గా ఎందుకు పిలవబడుతోంది ? అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. “ 40 శాతం కమిషన్ ఆరోపణల గురించి “సర్వజ్ఞుని” కి రాస్తున్నారు. కానీ ఇంతవరకు సమాధానమే రాలేదు ” అని వ్యాఖ్యానించారు. రైతులు తమ జీవితాలను బలిగొంటుంటే ప్రధాని మోడీ మౌనం పాటించారని ప్రియాంక ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News