Monday, December 23, 2024

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒడిశాలో జరిగిన రైలు విషాదకర సంఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ‘ఉన్నత స్థానంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలిగా?’ అని ఆమె అన్నారు.

‘నిపుణుల సూచనలు, పార్లమెంటరీ కమిటీ, కాగ్ నివేదిక ఎన్ని హెచ్చరికలు చేసినా వాటిని నిర్లక్షం చేసిందెవరు? రైల్వేలో ఖాళీలు భర్తీ చేయకపోవడానికి కారణం ఎవరు? ముఖ్యమైన రంగాల్లో నిధుల కొరతకు కారణం ఎవరు? ఇదివరకటి రైల్వే మంత్రులైన లాల్ బహదూర్ శాస్త్రి, నితీశ్ కుమార్, మాధవ్ రావు సిందియా మార్గంలో ఇప్పటి రైల్వే మంత్రి కూడా రాజీనామా చేయాలిగా?’ అని ప్రియాంక గాంధీ నిలదీశారు.

రైల్వేస్ అంతర్గత నివేదికలు, కాగ్ ఆడిట్ రిపోర్టు అనేక అవకతవకలున్నాయని పేర్కొన్నట్లు కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, శక్తిసిన్హా గోహిల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News