Monday, December 23, 2024

ఈ లూటీ ప్రభుత్వాన్ని దించేయండి: ప్రియాంక పిలుపు

- Advertisement -
- Advertisement -

మైసూరు: కర్నాటకలో బొమ్మై ప్రభుత్వం ప్రజలను లూటీ చేసిందని, ఇది 40 శాతం కమిషన్ సర్కార్ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. మంగళవారం కర్నాటకలోని మైసూరులో ఆమె ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి పట్టం కట్టినప్పటికీ ధనబలంతో బిజెపి ప్రజాభీష్టాన్ని కాలరాసిందని ఆమె విమర్శించారు.

గత ఐదేళ్లుగా రాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ ధనాన్ని, ప్రజలను లూటీ చేసిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఉంచి వచ్చే నిధులు తగ్గిపోయాయని, ముఖ్యమంత్రులు మారుతున్నారే తప్ప మంత్రివర్గం మారలేదని ఆమె అన్నారు. కొవిడ్ సహాయ నిధులను కూడా బిజెపి స్వాహా చేసిందని, బడి పిల్లల మధ్యాహ్న పథకం నిధులను సైతం మింగేసిందని ఆమె ఆరోపించారు. వెయ్యి ఎయిమ్స్ ఆసుపత్రులను కడతామని ప్రగల్బాలు పలికిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వెయ్యి తగతి గదులను కూడా కట్టలేదని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రియాంక తెలిపారు. ఈ నిధులు, ఉద్యోగాలు ప్రజలవేనని, బిజెపికి అభివృద్ధి చేయడం చేతకాదని ఆమె విమర్శించారు.

కర్నాటకలో నందిని డెయిరీని దెబ్బతీసేందుకే గుజరాత్ నుంచి అమూల్‌ను రాష్ట్ర మార్కెట్‌పై రుద్దేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి అధికంగా ఉండేదని ఆమె గుర్తు చేశారు. బసవణ్ణ పేరును బిజెపి దుర్వినియోగం చేస్తోందని, బిజెపికి ఓటు వేయకపోతే బసవణ్ణ ఆశీస్సులు మీకు ఉండాలని ఆ పార్టీ నాయకులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ప్రియాంక తెలిపారు. ఇది కర్నాటక ప్రజలను ఆవమానించడమేనని ఆమె అన్నారు.

కర్నాటక ప్రజలు అనాథలుగా, మగ్గాలన్నదే బిజెపి లక్షమని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు క్షీర్‌భాగ్య, కృషిభాగ్య, అన్నభౠగ్య వంటి పథకాలతోపాటు ఇందిరా క్యాంటీన్లను నిర్వహించిందని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో చెరకు రైతులు కష్టాలలో ఉంటే బిజెపి ప్రభుత్వం మాత్రం తన పారిశ్రామికవేత్తలైన మిత్రుల గురించే ఆలోచిస్తోందని ప్రియాంక ఆరోపించారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో తాము రైతు రుణాలను మాఫీ చేశామని, ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోనే అత్యధిక ఎంఎస్‌పి ఉన్నదని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే కర్నాటకలో అభివృద్ధి జరుగుతుందని తాము హామీ ఇస్తున్నామని ఆమె అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత కరెంటు, 10 కిలోల ఉచిత బియ్యం, రూ. 3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,000 ఆర్థిక సహాయం అందచేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News