Wednesday, January 22, 2025

నేడు తాండూరు, కామారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ నెల 11 శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముందుగా ఉదయం 10 గంటలకు పఠాన్ చెరు కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూర్‌లో జరిగే జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News