Saturday, December 21, 2024

బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం ఒక్కటే: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలిపారు. జహీరాబాద్ రోడ్‌షోలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ ఎన్నికలలో బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం సహకరించుకుంటున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదని, టిఎస్‌పిఎస్‌లో పరీక్షల పేపర్లు లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఈ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు. రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. దేశ సంపదను ప్రధాని మోడీ ఆదానీకి దోచిపెడుతున్నారని, తెలంగాణ ప్రజల కలలు, అభివృద్ధి కోసం పోరాటం చేయాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News