కనకగిరి (కర్ణాటక): బిజెపి ప్రభుత్వ అవినీతి రాజకీయాలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీప్రియంకగాంధీ మండిపడ్డారు. అధికార బిజెపి వైఖరి కారణంగా ధరలు ఆకాశానికి అంటుతున్నాయని ఆమె ఆరోపించారు. దీంతో సామాన్యులు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారన్నారు. రాష్రవ్యాప్తంగా అవినీతి పేరుకుపోయింది. కర్ణాటకలో బిజెపి పాలనను 40శాతం కమీషన్ ప్రభుత్వంగా పిలుస్తారన్నారు.
Also Read: మే 6న కర్ణాటకలో సోనియాగాంధీ ప్రచారం
రాష్ట్రంలో ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయని ప్రియాంకగాంధీ వాద్రా వంటగ్యాస్ సిలిండర్, బియ్యం, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయని కొప్పాల్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక తెలిపారు. బిజెపి పాలనలోఉద్యోగ నియామకాల్లోనూ అక్రమాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. బిజెపి ఎంఎల్‌ఎ కుమారుడు నివాసంలోనే రూ.8కోట్ల అవినీతి సొమ్ముతో పట్టుబడటం అధికార ప్రభుత్వ పనితీరును తెలుపుతోందని ప్రియాంకగాంధీ విమర్శించారు.