Friday, November 22, 2024

ప్రియాంక గాంధీకి ఆస్వస్థత..ఆస్పత్రిలో చేరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాస్నారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా శుక్రవారం వెల్లడించారు. ఈ కారణంగా తాను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో ఈ రోజు పాల్గొనలేకపపోతున్నానని ఆమె తెలిపారు. న్యాయ యాత్రలో పాల్గొంటున్న తన సోదరుడు రాహుల్ గాంధీ, పార్టీ ఇతర నాయకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తన ఆరోగ్యం కుదుపడిన వెంటనే తాను న్యాయ యాత్రలో పాల్గొంటానని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ ధ్వర్యంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర శుక్రవారం సాయంత్రం బీహార్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని చందౌలి వద్ద ప్రియాంక భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనవలసి ఉంది.

ఉత్తర్ ప్రదేశ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని, అనారోగ్యం కారణంగా తాను నేడు ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె శుక్రవారం తెలిపారు. తన ఆరోగ్యం కుదుపడిన వెంటనే తాను యాత్రలో పాల్గొంటానని, అప్పటి వరకు తన సోదరురితోపాటు యాత్రలో పాల్గొటున్న ఇతర యాత్రికులకు తన శుభాకాంక్షలని ఆమె తెలిపారు. మణిపూర్‌లో ప్రారంభమై ముంబైలో ముగియనున్న న్యాయ యాత్రకు రాహుల్ గాంధీ సారథ్యం వహిస్తున్నారు. గురువారం బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఒక భారీ సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం బీహార్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిన న్యాయ యాత్ర అనేక పార్లమెంటరీ నియోజకవర్గాల మీదుగా సాగనున్నది. ఈ నెల 16 నుంచి 21 వరకు, తిరిగి 24 నుంచి 25 వరకు ఉత్తర్ ప్రదేశ్‌లో యాత్ర సాగనున్నది. ఫిబ్రవరి 22, 23 తూదీలలో యాత్రకు విరామం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News