Sunday, January 19, 2025

నేడు రాష్ట్రానికి రానున్న ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలతో ప్రచారంలో దూకుడు పెంచిన హస్తం నేతలు తాజాగా మహిళా ఓటర్లపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్రకు చేరుకొని మహిళలతో ఆమె సమావేశం కానున్నారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలపై అక్కడ ప్రచారం చేస్తారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కొల్లాపూర్ నియోజవర్గ కేంద్రంలో నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News