Wednesday, January 22, 2025

ప్రియాంక గాంధీకి మళ్లీ కరోనా… రాహుల్ రాజస్థాన్ పర్యటన రద్దు

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi is infected with Corona again

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి మళ్లీ కరోనా సోకింది. తనకు మరోసారి వైరస్ సోకిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నట్టు అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితర కాంగ్రెస్ నాయకుడు కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్త చర్యగా రాహుల్ గాంధీ కూడా తన రాజస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. రాజస్థాన్ అల్వార్ జిల్లా తిజారాలో కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో బుధవారం రాహుల్ ప్రసంగించాల్సి ఉంది. గత ఏడాది జూన్‌లో ప్రియాంక గాంధీ కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్ నేతలు అనేక మంది కరోనా బాధితులయ్యారు. పార్టీ కమ్యూనికేషన్ విభాగం అధినేత పవన్ ఖెరా, పార్టీ ఎంపి అభిషేక్ మను సింఘ్వీలకు కరోనా సోకింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News