Wednesday, April 2, 2025

వయనాడ్ బరిలో ప్రియాంక

- Advertisement -
- Advertisement -

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించిన దరిమిలా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. తన సోదరుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖరారైంది. క్రియాశీల రాజకీయ ప్రవేశం చేసిన ఐదేళ్ల తర్వాత ఆమె పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ఆమెకు అవకాశం ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలితోపాటు వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాలలో

గెలుపొందిన రాహుల్ గాంధీ రాయ్‌బరేలిని అట్టిపెట్టుకుని వయనాడ్‌ను వదులుకోవాలని నిర్ణయించుకున్న నాటి నుంచే ఆ ఖాళీ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలిచిన పక్షంలో ప్రియాంక గాంధీ మొదటిసారి పార్లమెంట్‌లోకి ప్రవేశిస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురూ పార్లమెంట్‌లో ఉండే అవకాశం లభిస్తుంది. వయనాడ్ పార్లమెంటరీ స్థానంతోపాటు 47 అసెంబ్లీ స్థానాలకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News