Wednesday, December 25, 2024

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుంది: ప్రియాంక గాంధీ జోస్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాయి. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ దిగింది. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రియాంకగాంధీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. టీమిండియా మొదటి వరల్డ్‌కప్ గెలిచినప్పుడు భారత్‌లో ఇందిరా సర్కార్ ఉందని, అలాగే నేడు ఇందిరా గాంధీ జయంతి రోజున ఇండియా కప్ గెలువనుందని ప్రియాంక గాంధీ జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News