Monday, December 23, 2024

మెదక్ లో త్వరలోనే ప్రియాంక గాంధీ సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెదక్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో సభను త్వరలోనే ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత వెలువడే అవకాశం ఉంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ప్రియాంక గాంధీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. సోమవారం నాడు నిర్వహించే పిసిసి సమావేశంలో ఈ విషయమై చర్చించ నున్నారు. గతంలో మెదక్ ఎంపీ స్థానం నుండి ఇందిరాగాంధీ విజయం సాధించారు. అయితే అదే జిల్లాలో ప్రియాంక గాంధీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ఈ నెల 8వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు వచ్చారు.

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ను ప్రకటించారు. రానున్న రోజుల్లో బిసి డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. బిజెపి నేతలు రెండు రోజుల క్రితం బిసి డిక్లరేషన్‌ను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటముల్లో కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో బిసిలను తమ వైపునకు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు పారంభించాయి. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాగ్రెస్ యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలను రేవంత్ రెడ్డి వివరించారు. యూత్ డిక్లరేషన్ లో తాము ఇచ్చిన అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రియాంక గాంధీ కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే యూత్ డిక్లరేషన్ ను అమలు చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఏం చేయనున్నారో యూత్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించింది. ప్రియాంకగాంధీ ద్వారా బిసి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఆరు మాసాల సమయం ఉంది. ఎన్నికల షెడ్యూల్ నాటికే అన్ని వర్గాలకు ఏం చేయనున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News