Monday, December 23, 2024

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ స్పందన!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2019 నాటి ఓ పరువు నష్టం దావా కేసులో పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి అనర్హత వేటుకు గురయ్యాక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ‘నీరవ్ మోడీ కుంభకోణం రూ. 14000 కోట్లు, లలిత్ మోడీ కుంభకోణం రూ. 425 కోట్లు, మెహుల్ ఛోక్సీ కుంభకోణంరూ. 13500 కోట్లు. భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఎందుకని అవినీతిపరులకు కొమ్ము కాస్తోంది? అదానీ-హిండెన్‌బర్గ్ అంశాన్ని దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఇష్టపడ్డంలేదు?’ అని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీని దోషిగా గుజరాత్ కోర్టు నిర్ధారించాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ప్రతిపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News