న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భయంతోనే చమురు ధరలపై ఎక్సైజ్ సుంకం కొంతమేర తగ్గించిందని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్ సుంకం కొంతమేర తగ్గించి ప్రజలకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గించారు. ఈ తగ్గింపుతో ప్రధాని మోడీ ప్రజలకు దీపావళి కానుక ఇచ్చారని భాజపా నేతలు చెబుతుంటే ఉప ఎన్నికల్లో భంగపడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు అంటున్నాయి. తగ్గింపుపై ట్విటర్ వేదికగా ప్రియాంకా గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వం.. భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందే తప్ప మనస్ఫూర్తిగా కాదు. పండగకు ముందు ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సింది పోయి నిత్యవసర ధరలను భారీగా పెంచింది. ఎన్నికల ముందు కంటితుడుపుగా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేసిన దోపిడిని తిరిగి రాబట్టాలంటే.. వచ్చే ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలి’’అని ప్రియాంకా ట్వీటర్‌లో పేర్కొంది.
Priyanka Gandhi reacts on Fuel Price reduction