Friday, January 24, 2025

30 ఏళ్ల పాటు గృహిణిని:ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

ప్రజల సమస్యలను లేవదీసేంత పెద్ద గొంతు తనది అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం నవ్వుతూ చెప్పారు. గృహిణిగా తన అనుభవాన్ని ఆమె ఈ సందర్భంగా ఉటంకించారు. తన భర్త దీనిని ధ్రువీకరించగలరని ఆమె అన్నారు, వయనాడ్ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ చుంగర్తలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, తాను 30 ఏళ్లకు పైగా గృహిణిగా ఉన్నానని, ప్రజల సమస్యలను ప్రస్తావించేంత పెద్ద గొంతు తనది అని చెప్పారు. ‘నేను 30 ఏళ్లకు పైగా గృహిణిగా ఉన్నాను. అందువల్ల నిజంగా నాకు పెద్ద గొంతు ఉన్నది. నా భర్త మీకు చెప్పగలరు. మీ కోసం ఇక్కడ ఒక పోరాట యోధ ఉన్నది. మీరు నాకు మద్దతు ఇవ్వాలని అనుకుని మీ ఎంపిని చేసినట్లయితే, మిమ్మల్ని నిరాశ పరచను’ అని ఆమె తెలిపారు.

తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ బిజెపిపై విరుచుకుపడ్డారు. గడచిన పది సంవత్సరాలుగా వివిధ మతాల మధ్య శాంతియుత, ప్రేమానుగత అనుబంధాన్ని బిజెపి నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. ‘వారు (బిజెపి) వివిధ వర్గాల మధ్య భయం, కోపం, ద్వేషం, అపనమ్మకం విత్తనాలు నాటజూశారు. రాజకీయాల్లో పరస్పరం పోరాడాలని మీతో చెప్పినప్పుడు మీ భావోద్వేగాల నుంచి వేరే ఎవరో లబ్ధి పొందుతున్నారు’ అని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికార పార్టీ బిజెపి ఎంతో జాగ్రత్తగా ప్రజల దృష్టి మరల్చిందని, ఇక ప్రధాని ఐదారు వాణిజ్య సంస్థల పట్ల సానుకూలత చూపారని, అవి అన్ని ప్రయోజనాలూ పొందాయని ప్రియాంక విమర్శించారు. ‘జనం ఇంకా గ్రహించక ముందే అన్ని రేవులు, విమానాశ్రయాలు, పిఎస్‌యుల అనుబంధ సంస్థలు. భారీ రోడ్ ప్రాజెక్టులు, సర్వస్వం ప్రధాని వాణిజ్య మిత్రుల పరం చేశారు’ అని ఆమె చెప్పారు.

బిజెపి రాజకీయాల ఫలితంగానే ప్రధాని వయనాడ్ వరద బాధితులను కలుసుకోవడానికి కేరళ వచ్చారని, కానీ ప్రజలకు వారి జీవితాల పునర్నిర్మాణానికి కావలసిన నిధులను ఆయన నెలల తరబడి విడుదల చేయలేదని ప్రియాంక ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News