Monday, December 23, 2024

యోగి ఆదిత్యనాధ్‌కు ప్రియాంక గాంధీ ఘాటు ప్రశ్న

- Advertisement -
- Advertisement -

BJP has no mercy on small traders and poor people

 

లక్నో : మహిళలు హింసాత్మక సంఘటనలకు బాధితులవుతుండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రసంగాల్లో శాంతిభద్రతల గురించి ప్రస్తావించడం ఆపేయాలని డిమాండ్ చేశారు. మహిళలను చంపేసినా, హింసించినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నావ్‌లో ఓయువతి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. ఉన్నావో లో జరిగిన సంఘటన ఉత్తరప్రదేశ్‌కు కొత్తదేమీ కాదన్నారు. తన కుమార్తె కోసం ఓ దళిత మహిళ అన్నిస్థాయిల్లోని అధికారుల వద్దకు వెళ్లినట్టు తెలిపారు. చివరికి ఆమెకు తన కుమార్తె మృతదేహం చేరిందన్నారు. పాలనాయంత్రాంగం ఆమె మాటలను పట్టించుకోలేదన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయడానికి బదులుగా జనవరిలోనే ఆమె మాటలను పాలనా యంత్రాంగం ఎందుకు వినిపించుకోలేదో బీజేపి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడడం మానేయాలని యోగి ఆదిత్యనాధ్‌ను డిమాండ్ చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News