Monday, December 23, 2024

ఎక్కడుంది వికాసం?: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా గురువారం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల దుస్థితి వంటి సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేరే వికాస్ కా దో హిసాబ్(నా అభివృద్ధిపై సమాధానమివ్వండి) ప్రచారాన్ని పురస్కరించుకుని ఆమె కేంద్రంలోని మోడీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.. కార్పొరేట్లకు చెందిన రూ. 6 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని, కాని అప్పులు తీర్చలేక రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

రైతుల ఆదాయం ఎప్పుడు రెట్టింపు అవుతుందని, రైతులకు కనీస మద్దతు ధర ఎప్పుడు లభిస్తుందని ఆమె మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ పదవులలో, వనరులలో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మైనారిటీలు, పేద అగ్రవర్ణాలు ఎందుకు భాగస్వామ్యం కావడం లేదని ఆమె ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం ఎందుకు పతాక స్థాయికి చేరిందని, కుటుంబాలను పోసించడం సామాన్యులకు ఎందుకు భారంగా మారిందని ప్రియాంక ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగిపోతున్నాయని కూడా ఆమె ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న నేరస్థులకు రక్షణ కల్పించడం ఎప్పుడు ఆగిపోతుందని కూడా ఆమె నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News