Thursday, December 19, 2024

రాజ్యాంగామా.. రాద్ధాంతమా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి/తాండూర్: గత 15 ఏళ్లుగా దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న భారతీయ జన తా పార్టీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చే స్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌కు మద్దతుగా కామారెడ్డి, వికారాబాద్ జి ల్లా, తాండూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారం లో ఆమె పాల్గొన్నారు. కామారెడ్డిలోని ఇందిరా గాంధీ చౌరస్తా నుండి రోడ్ షోలో పాల్గొన్న ఆమె పొట్టి శ్రీరాము లు విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మా రుస్తుందని హెచ్చరించారు. తద్వారా ప్రజల మధ చిచ్చు పెట్టాలని చూస్తుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులమని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. పేద, బడుగు బలహీన వర్గాలను దోచుకొని బడా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోందన్నారు. కేవలం ధనిక వర్గాల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని ఆరోపించా రు. మోడీ వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన వ్యాపారులను వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు.

మోడీ మిత్రులకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ అయి న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. గత ప దేళ్ల కాలంలో రూపాయి విలువ గణనీయంగా పడిపోయిందని, దేశ ప్రతిష్ట మంట కలిసిందని దుయ్యబట్టారు. 1౦ సంవత్సరాలుగా మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అణగారిన వర్గాలను అధికారానికి దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేద రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చే సిందేమీ లేకపోవడంతో రుణాలు చెల్లించలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం కాచుకున్న బిజేపి గత 1౦ ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. పేదల అభ్యున్నతి కోసం పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు తమ కుటుంబం దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు కడుపునిండా అన్నం దొరికిందని, ఉపాధి హామీ లాంటి పథకాలతో ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 25 హామీలను అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య కాంగ్రెస్ పాలనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్ షోలో ఆరోగ్య శాఖ మంత్రిదామోదర రాజనరసింహా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, ఎంఎల్‌ఎలు మదన్‌మోమన్ రావు, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.దేశంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తానని మోడీ ప్రచారం చేస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. వికారాబాద్ జిల్లా , తాండూరు విల్యామూన్ హైస్కూల్ మైదానంలో పార్లమెంట్ ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ.. 140 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఉన్న రాజ్యాంగాన్ని మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నలధనాన్ని తెస్తామని చెప్పిన బిజెపి నాయకులు వారే నల్ల ధనాన్ని దాచుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు, జిఎస్‌టి ద్వారా సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు.

ధర్మం పేరుతో కుటుంబాల్లో గొడవలు సృష్టించేందుకు బిజెపి నేతలు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, ఆకలి పరిస్థితులు పెరిగాయన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే బాధితుల పట్ల కాకుండా అత్యాచారం చేసిన వారికే బిజెపి నాయకులు మద్దతుగా నిలిచారని విమర్శించారు. దేశ ప్రధానిగా మోడీ పదేళ్ల పాలనలో తాను ఏంచేశారో, దేశానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 140 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటంతోపాటు రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగిస్తామని అన్నారు. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను పరిపూర్తి చేస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News