ఆసిఫాబాద్ : ఆరు గ్యారంటి పథకాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రయాంకగాంధీ అన్నారు. అదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ విజయభేరి సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేర్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామని, ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణలో అధికారంలోకి వస్తామని అన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ఉద్యమాలు చేసి బలిదానం చేసుకున్నారని, వారిని గుర్తించే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మనం ఎంతగానో అభివృద్ధ్ది చెందుతామని అనుకుంటే పది సంవత్సరాలు మరింత వెనక్కి వెళ్లామని అన్నారు. కాంగ్రేస్ పార్టీ ఆధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని, మహిళల కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందించామని అన్నారు. రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు రూ. 3 వేల రూపాయలు అందజేస్తామని అన్నారు.
అలాగే రైతుల కోసం పంట పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరం రూ. 15 వేల రూపాయలు అందిస్తామని, ఒకేసారి 2 లక్షల రుణామాఫీ చేస్తామని అన్నారు. తెలంగాణలో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. దళిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండా ఓట్లు చీల్చేందుకే కేంద్ర ప్రభుత్వం కమిటీలతో కాలాయాపన చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రపంచంతో పోటీపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అదివా సీలకు భూమి హక్కు చట్టాలను కల్పించామని, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేశామని అన్నారు. అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్, కర్ణాటక రాష్ట్రాలలో చాలా అభివృద్ధ్ది జరుగుతుందని, ప్రతి సంవత్సరం నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రేస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు.
కుల మతల పేరుతో బిజేపి ప్రభుత్వం చిచ్చు పెడుతుందని, దీనిని అందరు గమనించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజల అకాంక్షల మేరకే పని చేస్తుందని, ప్రజలకు ఎమి అవసరం ఉంటుందో ఆ పనులను పూర్తి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రాబోయో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని అన్నారు. ఈ కా ర్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్‌రాథోడ్, డిసిసి అద్యక్షులు కోక్కిరాల విశ్వప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అజ్మీర శ్యాంనాయక్, రావి శ్రీనివాస్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.