Tuesday, December 24, 2024

నమ్మి ఓటు వేసి 10ఏళ్లు వెనక్కి పోయారు: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

రెండుసార్లు నమ్మి బిఆర్ఎస్ కు ఓటు వేసి 10ఏళ్లు వెనక్కి పోయారని అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గురించి కేసీఆర్ ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల ఆకాంక్షలు నెరవేడం లేదని అన్నారు. ఆసిఫాబాద్ ప్రజలకు బిఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని.. ధరణి ద్వారా రైతులను, ప్రజలను బిఆర్ఎస్ మోసం చేసిందని.. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన వారు లేరని ఆమె చెప్పారు. ఒకసారి ఎన్నికల్లో ఇందిరా గాంధీ కూడా ఓడిపోయారని.. అయితే, ఆమెను ఓడించినప్పుడు ప్రజలు తప్పు చేశారని ఇందిరా గాంధీ అనలేదని, తాను తప్పు చేసి ఉంటే క్షమించాలని మాత్రమే ప్రజలను కోరారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతూ.. తెలంగాణను అప్పులపాలు చేసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..ఈ ఎన్నికల్లో కెసిఆర్ కు ఓటమి తప్పదని చెప్పారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పరీక్ష తేదీలు, ఫలితాల ప్రకటన తేదీలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పుల పాలయ్యారని… కాంగ్రెస్ వచ్చిన వెంటనే రైతులకు ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫి చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు దర ఇస్తామని చెప్పారు. ప్రజలకు జవాబుదారిగా ఉన్న నేతలను ఎన్నుకొండని… ఆత్మపరిశీలన చేసుకుని ఓటు వేయండని ప్రియాంక గాంధీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News