Tuesday, December 24, 2024

హిందువులను రాహుల్ అవమానించరు:ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

హిందువులను హింసావాదాలుగా రాహుల్ గాంధీ అభివర్ణించారంటూ బిజెపి చేసిన ఆరోపణను ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. తన సోదరుడు హిందువులను అవమానించలేదని, బిజెపిని, ఆ పార్టీ నాయకుల గురించి మాత్రమే ఆయన మాట్లాడారని ప్రియాంక వివరించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా సోమవారం తొలిసారి రాహుల్ గాంధీ ప్రసంగించిన అనంతరం తన తల్లి సోనియా గాంధీతో కలసి పార్లమెంట్ వెలుపలికి వచ్చిన ప్రియాంక విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ హిందువులను అవమానించబోరని చెప్పారు. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారని, తాను బిజెపి గురించి,

ఆ పార్టీ నాయకుల గురించి మాత్రమే చెబుతున్నానని కూడా ఆయన అన్నారని ప్రియాంక చెప్పారు. అంతకుముందు లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ తమను తాము హిందువులుగా చెప్పుకునే వారు నిరంతరం హింసకు, విద్వేషానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సైతం కల్పించుకుంటూ యావత్ హిందూ సమాజాన్ని హింసావాదులుగా పేర్కొనడం తీవ్రమైన విషయమని అన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేయగా తాను బిజెపి గురించి చెబుతున్నానని రాహుల్ స్పష్టం చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, లేదా మోడీ యావత్ హిందూ సమాజం కాదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News