Monday, December 23, 2024

హైదరాబాద్‌లో ప్రసంగించనున్న ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై బహిరంగ సభలో ప్రసంగించడానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మే 8న హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆమె హైదరాబాద్ రాబోతున్నారు.
సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసే బహిరంగ సభకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి) ఇప్పటికే ఏర్పాట్లు మొదలెట్టింది. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగునున్నాయి. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటోంది. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు. ప్రియాంక గాంధీ చేయనున్న బహిరంగ సమావేశ ఉపన్యాసం, ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరుద్యోగ సమస్య ఉద్యమానికి ఊతమిచ్చేదిగా ఉండనున్నది. కాంగ్రెస్ ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, ఇతర ప్రదేశాలలో నిరసనలు కూడా చేపట్టింది.

మే 8న జరిగే బహిరంగ సమావేశంలో ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు. ఈ బహిరంగ సమావేశంలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ యువతకు ఏమి చేయనున్నదో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి వివరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News