Monday, December 23, 2024

ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో యువత తీవ్ర ఆవేదనలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. నిరాశలో ఉన్న యువతకు భరోసా ఇచ్చేందుకే భరోసా సభ అని భట్టి తెలిపారు. రేపటి సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ఏం చేయనుందో ప్రకటిస్తామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు న్యాయం జరగాలేదని విక్రమార్క ఆరోపించారు. పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం లాక్కుందన్నారు. కార్పొరేట్లకు అమ్ముకునేందుకు రాష్ట్రమంతా చూస్తే రూ.25 లక్షల కోట్ల విలువైన పేదల భూములు లాక్కుందని భట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News