Friday, January 24, 2025

రేపు వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం(అక్టోబర్ 23) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో తన నామినేసణ్ దవాఖలు చేయనున్నారు. ప్రియాంక నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలుకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ ఉదయం 11 గంటకు కల్పెట్ట కొత్త బస్టాండు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రోడ్డు షో నిర్వహిస్తారని వారు చెప్పారు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రియాంక గాంధీ జిల్లా కలెక్టర్ సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని వారు తెలిపారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో యుడిఎఫ్ అభ్యర్థి ప్రియాంక పోటీ చేస్తున్నారు. తమ మద్దతు తెలియచేసేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. వయనాడ్ లోక్‌సభ సీటుకు గతవారం ఉప ఎన్నికను ప్రకటించడంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఐదేళ్ల తర్వాత ప్రియాంక ఎన్నికల అరంగేట్రానికి మార్గం సుగమైంది.

ఎన్నికల సంఘం వయనాడ్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ప్రకటించింది. 52 సంవత్సరాల ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు అంగించి తమ హర్షాన్ని ప్రకటించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తోపాటు ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాలలో గెలుపొందడంతో వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ నాయకత్వం జూన్‌లోనే ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో గెలుపొందితే ఎంపీగా మొట్టమొదటిసారి ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో ప్రవేశిస్తారు. అంతేగాక గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు సోనియా, రాహుల్, ప్రియాంక మొదదటిసారి పార్లమెంట్‌లో కనిపిస్తారు. నవంబర్ 13న వయనాడ్ పార్లమెంటరీ స్థానంతోపాటు 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి చెందిన మొదటి దశ ఎన్నికలు కూడా అదే రోజు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News