Sunday, December 22, 2024

వాయనాడ్ లో ప్రచారం చేయనున్న ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం:కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్ 3 నుంచి వాయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల ప్రచారం మొదలెట్టనున్నది. ఆమె వెంట ఆమె సోదరుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్నికాంగ్రెస్ పార్టీ శుక్రవారం తెలిపింది.

ప్రియాంక గాంధీకి ఇదే తొలి ఎన్నికల ప్రచారం. ఇదివరలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయలేదు. కాకపోతే ప్రచార సభలలో పాల్గొన్నారు. కాగా ఎల్ డిఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకేరి మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాదిరిగానే ప్రియాంక గాంధీ కూడా వాయనాడ్ కు ఓ అతిథిలా వచ్చి వెళ్లిపోతుందన్నారు. బిజెపి అభ్యర్థి నవ్యా హరిదాస్ కూడా ప్రియాంక గాంధీ ఓ పండుగలా వచ్చి వెళ్లిపోయేదేనన్నారు.ఇదిలావుండగా సిపిఐ(ఎం) నుంచి దూరమైన నీలాంబుర్ స్వతంత్ర ఎంఎల్ఏ పి.వి.అన్వర్ ఇప్పటికే ప్రియాంకకు మద్దతును తెలిపారు. వాయనాడ్ నియోజకవర్గానికి ఓటింగ్ నవంబర్ 13న ఓటింగ్ జరుగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News