Sunday, January 19, 2025

నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు మరో వారం రోజులే ఉండడంతో ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో విస్తృత పర్యటన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు(శుక్రశారం), రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి, 1.30కి హుస్నాబాద్, సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొననున్నారు.

ఇక రాత్రికి ఖమ్మంలో ప్రియాంక బస చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు, మధ్యాహ్నం సత్తుపల్లి, మధిర ప్రచార సభలలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News