Friday, December 20, 2024

న్యాయ్ యాత్రలోకి ప్రియాంక

- Advertisement -
- Advertisement -

మొరాదాబాద్‌లో చేరనున్న కాంగ్రెస్ నేత
యుపి తదుపరి దశలో భాగస్వామ్యం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో శనివారం మొరాదాబాద్‌లో చేరతారు. వారాంతంలో యాత్ర ఉత్తర ప్రదేశ్ తదుపరి దశలో పాల్గొంటారు. వాస్తవానికి యాత్ర చందౌలిలో ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశించినప్పుడు ఆమె యాత్రలో పాల్గొనవలసి ఉంది. కానీ అనారోగ్యం బారిన పడడం, ఆసుపత్రిలో చేరడం వల్ల ఆమె యాత్రలో పాల్గొనలేకపోయారు. యాత్ర శనివారం మొరాదాబాద్‌లో తిరిగి ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భాగస్వామి అవుతారు.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్ తదుపరి దశలో ఆమె యాత్రతో కొనసాగుతారు. ప్రియాంక గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కోసం శనివారం (24న) రాహుల్ గాంధీతో చేరతారని ఆమె కార్యాలయం తెలియజేసింది. ఆమె రాహుల్ వెంట మొరాదాబాద్ నుంచి అమ్రోహా, సంభల్, బులంద్‌శహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా ఫతేపూర్ సిక్రీ వరకు కలసి సాగుతారని పార్టీ వివరించింది. కాగా, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం (25న) ఆగ్రాలో యాత్రలో చేరగారు. యాత్ర 24 ఉదయం మొరాదాబాద్‌లో తిరిగి ప్రారంభమై పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని కీలక జిల్లాల మీదుగా సాగి ఆదివారం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు చేరుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News